Monday, May 31, 2010

తొలిసంధ్య వెలుగులో ఉదయించే సూర్యుడిని చూస్తుంటే నీ నుదిటిన పెట్టుకునే సిందూరం గుర్తుకువస్తుంది
సాయంసంద్యలో ఎర్రగా మారిన ఆకాశం వంక చూస్తుంటే అప్పుడప్పుడు నువ్వు పెట్టుకున గోరింటాకు గుర్తుకువస్తుంది
వేసవి కాలంలో సైకిల్ మీద అమ్మే మల్లెపువ్వులను చూస్తుంటే గమ్మతుగా నవ్వే నీ నవ్వు గుర్తుకువస్తుంది
ఆరుబయట వున్నా చెట్టు మీద కోయిల కుస్తుటే నా చెవిలో నువ్వు చెప్పే చిలిపి సంగతులు గుర్తుకువస్తాయి
నిద్ర లేవగానే నా మొదటి ఆలోచన నువ్వే
నిద్ర పోయేముందు నా చివరి ఆలోచన నువ్వే
నువ్వు రాక ముందు నాకు అన్ని రోజులు ఒకేలా ఉండేవి
కానీ నువ్వు వచ్చిన తరువాత నాకు ప్రతి క్షణం KOTHAGA వుందిరా ....

Saturday, May 29, 2010

వస్తావా .......చూస్తున్నాను

నిన్నే అడుగుతున్నాను నన్ను చూడడానికి నువ్వు వస్తావా
కనీసం రోజులో ఒక్కసారి అయిన నన్ను చూడకపోతే బ్రతకలేను అన్నావు
విడిపోయిన తరువాత కనీసం వారానికి ఒక్కసారి అయిన చూడకపోతే ఉండలేను అన్నావు
అలాంటిది నెలలు గడిచి పోతున్న నీకు నన్ను చూడాలని అనిపించడం లేదా
గడియారంలో తేది మారినంత వేగంగా , గోడమీద కేలండర్ మారినంత సాదారణంగా
నువ్వు మారిపోయావు
అని నేను నిన్ను ఎప్పుడు అడగలేదు కానీ
నువ్వు మాత్రం నేను ఇదివరకటి లేను అని చాల సార్లు అన్నావు అంటున్నావు
నేను ఎందుకు మరిపోయనో నీకు తెలియదా , తెలియదు అని ఒక్కసారి చెప్పు
నేను ఎందుకు మరిపోయనో నీకు చెపుతాను......

Tuesday, May 11, 2010

చనిపోవాలని అనుకుంటున్నాను

చాల రోజులు గడిచి పోయాయి ఇంకా ఎందుకు నిన్ను
మర్చిపోలేక పోతున్నాను నాకు అర్థంకావడం లేదు
నన్ను వదిలి, నన్ను మర్చిపోయి నువ్వు సంతోషంగా వున్నపుడు
మరి నిన్ను మర్చిపోయి నీను ఎందుకు సంతోషంగా కనీసం సాదారణంగా
బ్రతకలేకపోతున్నాను అర్థం కావడం లేదు
ఇంకా ఎన్ని రోజులు ఇలా చస్తూ బ్రతకాలి
అందుకే "అదే సమయానికి" నేను చాచిపోవాలని
అనుకుంటున్నాను ...........