Wednesday, January 4, 2012

ఎప్పుడు తనని చూసానో కచితంగా చెప్పలేను
కానీ తనని నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం తను నాకు దూరం అయిపోతుంది అని తెలిసినప్పుడు తెలిసింది
ఒక మనిషి కానీ వస్తువు కానీ మన దగ్గర వున్నపుడు దాని విలువ తెలియదు అంటారు
అది నిజం నాకు కూడా తను నాతో అన్ని రోజులు వున్నపుడు తెలియలేదు
ఇంకొన్ని రోజులలో తను నా నుంచి వెళ్ళిపోతుంది అని తెలిసినప్పుడే నాకు తెలిసింది తన "విలువ"

"ఒక మనిషి మనసులో ఏముందో తను చెప్పకుండానే మనకి తెలుస్తుంది"
"ఎ విషయం అయిన చెపితేనేకద తెలుస్తుంది "

Wednesday, July 7, 2010

మరచిపోవాలని...........




























నిన్ను మరచిపోవాలని ప్రతి నిమిషం అనుకుంటున్నాను
కానీ ఎలా అన్నది అర్థంకావడం లేదు
అందరితో సమానంగా నిన్ను చూస్తే నాకు ఈ బాధ వుండేది కాదు అందరికన్నా ఎక్కువుగా నీ గురించి ఆలోచించాను అందుకే ఇప్పటికి నిన్ను మర్చిపోలేకపోతునన్ను
ఒక్కసారి ఒకే ఒక్కసారి నిన్ను చూడాలని ఎందుకు నా జీవితంలోకి వచ్చావనీ అడగాలని వుంది 
నీ దగర సమాదానం వుందా ................

Wednesday, June 2, 2010

సంధ్యవేళ....














సాయంసంధ్య వేళ సాగరతిరాన  

నీతో కలిసి నడిచిన ఈ ఏడు అడుగులే చాలు

ఈ జన్మకి వచ్చే నా ఏడు జన్మలకి

Monday, May 31, 2010

తొలిసంధ్య వెలుగులో ఉదయించే సూర్యుడిని చూస్తుంటే నీ నుదిటిన పెట్టుకునే సిందూరం గుర్తుకువస్తుంది
సాయంసంద్యలో ఎర్రగా మారిన ఆకాశం వంక చూస్తుంటే అప్పుడప్పుడు నువ్వు పెట్టుకున గోరింటాకు గుర్తుకువస్తుంది
వేసవి కాలంలో సైకిల్ మీద అమ్మే మల్లెపువ్వులను చూస్తుంటే గమ్మతుగా నవ్వే నీ నవ్వు గుర్తుకువస్తుంది
ఆరుబయట వున్నా చెట్టు మీద కోయిల కుస్తుటే నా చెవిలో నువ్వు చెప్పే చిలిపి సంగతులు గుర్తుకువస్తాయి
నిద్ర లేవగానే నా మొదటి ఆలోచన నువ్వే
నిద్ర పోయేముందు నా చివరి ఆలోచన నువ్వే
నువ్వు రాక ముందు నాకు అన్ని రోజులు ఒకేలా ఉండేవి
కానీ నువ్వు వచ్చిన తరువాత నాకు ప్రతి క్షణం KOTHAGA వుందిరా ....

Saturday, May 29, 2010

వస్తావా .......చూస్తున్నాను

నిన్నే అడుగుతున్నాను నన్ను చూడడానికి నువ్వు వస్తావా
కనీసం రోజులో ఒక్కసారి అయిన నన్ను చూడకపోతే బ్రతకలేను అన్నావు
విడిపోయిన తరువాత కనీసం వారానికి ఒక్కసారి అయిన చూడకపోతే ఉండలేను అన్నావు
అలాంటిది నెలలు గడిచి పోతున్న నీకు నన్ను చూడాలని అనిపించడం లేదా
గడియారంలో తేది మారినంత వేగంగా , గోడమీద కేలండర్ మారినంత సాదారణంగా
నువ్వు మారిపోయావు
అని నేను నిన్ను ఎప్పుడు అడగలేదు కానీ
నువ్వు మాత్రం నేను ఇదివరకటి లేను అని చాల సార్లు అన్నావు అంటున్నావు
నేను ఎందుకు మరిపోయనో నీకు తెలియదా , తెలియదు అని ఒక్కసారి చెప్పు
నేను ఎందుకు మరిపోయనో నీకు చెపుతాను......