Tuesday, November 24, 2009

దూరం ...

మనుసుల మధ్య దూరం ఎందుకు పెరుగుతుందో నీకు తెలుసా
నాకు తెలుసు
మాటలు కరువైన వేళ మనుసుల మద్య దూరం పెరుగుతుంది
ఒక మనిషి అవసరం నీకు లేదు అనుకున్నపుడు మీ ఇద్దర మద్య దూరం పెరుగుతుంది
ఈ దూరం ఎవరిమధ్య పెరిగిన పరవాలేదు కానీ ఆలుమగల మద్య పెరిగితే అంత కన్నా నరకం ఇంకొకటి వుండదు
ఆలా దూరం పెరిగితే అంత కన్నా చావడం మంచిది.

మర్చిపోయావా ............

మనిషిని మర్చిపోవడం ఇంత తేలిక అని నేను ఎప్పుడు అనుకోలేదు
నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే కలిసి బ్రతకాలి లేదా కలిసి చావాలి అని అనుకునేవాడిని
కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ప్రేమించిన మనిషిని మర్చిపోవడం ఇంత తేలికైన విషయం అని అనిపిస్తుంది
రోజు రోజుకి మనిషి మీద, ప్రేమ మీద నమ్మకం పోతుంది
ఎందుకు ఇలా మారిపోయావు అని అడగను ఎందుకంటే నీ జీవితం నీ ఇష్టం ............

Sunday, November 1, 2009

మన్నించు నేస్తమా ............

నన్ను నేను మర్చిపోయాల చేసావు
నిన్ను నేను మర్చిపోకుండా చేసావు
మనిషి మీద, ప్రేమ మీద నమ్మకం లేకుండా చేసావు
బ్రతుకు మీద ఆశ లేకుండా చేసావు
ఇన్నాలు అన్నినువ్వే చేసావు అనుకున్నాను
కానీ ఇప్పుడు తెలిసింధీ
నిన్ను ప్రేమించి, నిన్నునమ్మించి మోసం చేసింది నీను అని
దేముడు నిజంగా వుంటే నన్ను ఎప్పటికి క్షమించడు

Thursday, October 29, 2009

ఒంటరి

ఒంటరితనం ఇంత భయంకరంగా వుంటదని నిజంగా నాకు తెలియదు
నువ్వు నా జీవితం లోకిరాక ముందు నీను ఒంటరితనం అనుబవించాను
కానీ ఎప్పుడు నాకు బాధ అనిపించలేదు
కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చి ఇప్పుడు వదిలి వెళుతుంటే
ఒంటరితనం చాల బాధ పెడుతుంది.
నువ్వు కనిపించని ఒక్క క్షణం ఎంత తపించానో ఎంత ఎదురుచుసనో నాకు తెలుసు
ఒక్క రోజు కనిపించకపొతే నాకు తెలుసు మరుసటి రోజు కనిపిస్తావని
కానీ ఇప్పుడు ఇంక నువ్వు నాకు కనిపించవు అని తెలిసిన తరువాత ఎలా బ్రతికేది
నీమీద నాకున్న ఆశ ఎప్పుడో చచ్చిపోయింది కానీ
ప్రేమ మాత్రం చావటం లేదు.............

Wednesday, September 16, 2009

నాకే ఎందుకిలా .......

ఒక్కొకసారి అనిపిస్తుంది నాకే ఎందుకిలా జరిగిందీ అని
కానీ,
ప్రపంచంలో ప్రతి మనిషి బాధ అనుబవించే ముందు ఇలాగె అనుకుంటాడు
నిజంగా బ్రతికి ఉండగానే స్వర్గ నరకాలు చూడాలనుకుంటే
"గజాల్ శ్రీనివాస్" చెపినట్లు ఎవరో ఒకరిని ప్రేమించాలి.
ప్రేమ చాల చిన్న పదం కానీ,
అది చూపించే ఆనదం, బాధ ప్రపంచం లో ఇంక ఏది కలిగించదు.
ప్రేమని, యుద్దని మొదలు పెట్టడం చాల తేలిక కానీ ముగించడం చాలా కష్టం.........

Monday, September 14, 2009

కాలం తిరిగిరాదు.......

నిజంగా నీతో గడిపిన ఎ నిమషం నేను మరిచిపోలేను ...

నువ్వు నాతో వున్నపుడు కాలం అల ఆగిపోతే బాగున్ను అనిపిస్తుంది,

నువ్వు నాతో లేనప్పుడు కాలం ఇసుకలా చేతిలోనుంచి జారిపోతే బాగున్ను అనిపిస్తుంది.

నా జీవితంలోకి వచ్చినప్పుడు నన్ను అడగలేదు

ఇప్పుడు నా నుంచి వెళ్లి పోతునప్పుడు నన్ను అడగడం లేదు

అంత నీ ఇష్టం

అప్పుడు నాతో మాట్లాడడం ఇష్టం అన్నావు

ఇప్పుడు నాతో మాట్లాడడం కష్టం అంటున్నావు.

ఎందుకు ఇలా మారిపోయావు అని అడగను కానీ

నీ మార్పూ విలువ ఒక మనిషి జీవితం అని గుర్తువుంచుకో ........


Friday, September 11, 2009

తప్పు చేశాను.......

హాయ్
నీ ఆనదం నలుగురుతో పంచుకో కానీ నీ బాధ నీలోనే దాచుకో అని నమ్మివాడిని. కానీ ఇప్పుడు అది తప్పని అనుకుంటున్నాను ఎందుకంటే నేను మారిపోయాను కనుక. ఎప్పుడు నవ్వుతు అందరిని నవిస్తూ వుండే నేను ఇప్పుడు నవ్వు అంటే ఎలా వుంటుందో చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే నేను మనసారా అనదంగా నవ్వి చాలా కాలం అయింది. ఎవరిని మనసుకి దగ్గరగా రానివకూడదు, ఒక్కసారి మనసుకి దగ్గర అయితే ఆ మనిషిని అంత తొందరిగా మరిచిపోలేము.